ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది.
14న వస్తున్న మరో సినిమా బ్రహ్మ ఆనందం. చాలా కాలం తర్వాత బ్రహ్మనందం తనయుడు హీరోగా చేస్తున్న ఈ సినిమాను బ్రహ్మీ భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. కంటెంట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో గౌతమ్ హిట్ కొడతారు అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటితో పాటు బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ కానుంది. రష్మిక మందన్నఎం విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సినిమాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు 14న రీరిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ ను గ్రాండ్ స్కేల్ లో ప్రేమికుల కోసం రీరిలీజ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ హీరో సూర్య, సమీరా రెడ్డిల కల్ట్ క్లాసిక్ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా ఆడియన్స్ ను పలకరించనుంది. స్టార్ బాయ్ సిద్దు సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ రేపే థియేటర్లలోకి వస్తుంది.