NTV Telugu Site icon

Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

Muskan Narang

Muskan Narang

Fashion Designer Muskan Narang Commits Suicide: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్కాన్‌ నారంగ్‌ బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని.. ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు రోజు రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడిపిన ఆమె.. ఆ మరుసటి రోజే విగతజీవిగా మారింది. ఉదయం లేచిన తర్వాత తల్లి గదిలోకి వెళ్లి చూడగా.. ముస్కాన్ కనిపించలేదు. బాత్రూంకి వెళ్లిందేమోనని భావించి వెళ్లి చూస్తే.. అక్కడా కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి.. ఇళ్లంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో.. ఇంటి పైనున్న స్టోర్ రూంకి వెళ్లి చూసింది. అక్కడ ముస్కాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే ముస్కాన్ తల్లి తల్లడిల్లిపోయింది. ఆమెను కిందకు దింపి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. ముస్కాన్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Ponniyin Selvan 2: మొదటి పార్ట్ కన్నా తక్కువే… అయినా ఇండస్ట్రీ హిట్

కాగా.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ముస్కాన్ తన అధికార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇదే తన చివరి వీడియో అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. ‘‘ఇదే నా చివరి వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నేను నా కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కన్విన్స్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాను కానీ.. వాళ్లే రివర్స్‌లో నన్ను కన్విన్స్‌ చేసేందుకు చూశారు. నేను తీసుకుంటున్న నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరినీ నిందించకండి’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియోని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఏ విషయంలో ముస్కాన్‌ని కన్విన్స్ చేశారు? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ లో దారుణం.. మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు

Show comments