NTV Telugu Site icon

Farooq Abdullah: ముందుగా ఎన్నికల్లో గెలుద్దాం.. ప్రధాని పదవిపై ఫరూఖ్ అబ్దుల్లా..

Farooq Abdullah

Farooq Abdullah

Farooq Abdullah comments on Mallikarjun Kharge: ముందుగా ఎన్నికల్లో గెలుద్ధాం, ఆ తరువాత ప్రధాని ఎవరు అవుతారో చూద్దాం అని కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్డుల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజస్వీ యాదవ్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read Also: Fruits And Vegetables Storage: ఈ ఐదు పండ్లను కూరగాయలను ఎప్పడూ కలిసి నిల్వ చేయకూడదు.. ఎందుకంటే..

భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. శ్రీనగర్, తమిళనాడు మధ్యలో ఉష్ణోగ్రత, ఆహారం, భాష అన్నీ భిన్నంగా ఉంటాయని, కానీ కలిసి జీవించడం, బలమైన భారతాన్ని నిర్మించడం కోరిక ప్రజల్లో ఉంటుందని ఆయన అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్రాన్ని నిర్మించినట్లే దేశాన్ని నిర్మించాలని అబ్దుల్లా కోరారు. స్టాలిన్, తండ్రి కరుణానిధికి గర్వకారణం అని అన్నారు. మనమంతా కలిసి పనిచేయాలని సూచించారు. మనమంతా గౌరవంగా, శాంతితో జీవించే దేశాన్ని నిర్మించాలని ఫరూక్ అబ్దుల్లా కోరారు. దేశాన్ని తయారు చేసేది ప్రజలే అని, సైన్యం కాదని, కలిసికట్టుగా సామరస్యంతో పనిచేయాలని, ఆశను కోల్పోవద్దని అన్నారు.

ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జన ఖర్గే స్పందిస్తూ.. ఉమ్మడి ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు ప్రధాని అవుతారో తాను ఎప్పుడూ చెప్పలేదని, విచ్ఛిన్న శక్తులపై పోరాడేందుకు భావసారుప్యత గత పార్టీలన్నీ కలిసి రావాలి, ఇదే మా కోరిక అని ఖర్గే అన్నారు.