ఫ్యాన్స్ ను సమస్యల్లోకి నెట్టిన సుదీప్ బర్త్ డే… 25 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం, అందులోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. కానీ ఆ అభిమానం చేయించే పిచ్చి పనులే ఆందోళనకరం. తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఏమైనా చేస్తారు. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ అభిమానుల పిచ్చి వారిని సమస్యల్లోకి నెట్టింది. కొన్నిసార్లు వారి చర్యలు తమ అభిమాన తారలకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు.
సెప్టెంబర్ 2న కిచ్చ సుదీప్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సుదీప్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఒక గేదె దూడను బలి ఇచ్చారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటు చేసుకున్న ఈ కార్యక్రమంలో 25 మంది వ్యక్తులు పాల్గొన్నారు. అయితే అభిమానం చాటుకోవడానికి ఒక మూగజీవాన్ని బాలి ఇచ్చినందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Read Also : సిద్ధార్థ్ శుక్లా మరణానికి జాన్ సెనా సంతాపం
కన్నడ చిత్రాలలో నటించే సుదీప్, తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో కూడా కనిపించాడు. ఆయనకు సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. “దబాంగ్ 3″లో బాలి సింగ్ అనే విలన్ పాత్రలో కన్పించి నార్త్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న ఈ స్టార్ హీరో పుట్టినరోజున నగరం అంతటా తన పోస్టర్లను అతికించి, భారీ కట్ అవుట్‌లను పెట్టి పూజించారు. అయితే ఆ 25 మంది చేసిన పని మాత్రం షాకింగ్ సంఘటనగా మారింది. బళ్లారి నగర్ పోలీసులు ఈ 25 మందిని అరెస్ట్ చేశారు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జంతు ప్రేమికులు మంది పడుతున్నారు.
ఇదిలా ఉంటే నటుడు కిచ్చా సుదీప్ ప్రస్తుతం పాపులర్ రియాలిటీ షో కన్నడ “బిగ్ బాస్ 8″ని హోస్ట్ చేస్తున్నారు. దర్శకుడు అనుప్ భండారి దర్శకత్వంలో “విక్రాంత్ రోనా” అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!