సిద్ధార్థ్ శుక్లా మరణానికి జాన్ సెనా సంతాపం

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ స్టార్ జాన్ సెనా ‘బిగ్ బాస్ 13’ విజేత సిద్ధార్థ్ శుక్లా మరణానికి సంతాపం తెలిపారు. సెనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాలికా వధు’ నటుడి ఫోటోను పోస్ట్ చేస్తూ నివాళులు అర్పించారు. సిద్దార్థ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన సెనా ఎలాంటి క్యాప్షన్‌ని ఇవ్వలేదు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు “పోస్ట్‌కు ధన్యవాదాలు సెనా” అంటూ కామెంట్లతో ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అసిమ్ రియాజ్, జస్లీన్, రాజీవ్ సేన్, శ్రద్ధా ఆర్య, ఇతర ప్రముఖులు సెనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేశారు. 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ పోస్ట్‌లను షేర్ చేస్తూ ఉంటారు.

Read Also : టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్

సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో సెప్టెంబర్ 2న కన్నుమూశారు. ఆయన అకాల మరణం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, అలియా భట్ సహా పలువురు బాలీవుడ్ తారలు అతని మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ అంత్యక్రియలు ముంబైలోని ఓషివారాలోని శ్మశానవాటికలో జరిగాయి. అతడితో సన్నిహిత బంధాన్ని పంచుకున్న షెహ్నాజ్ గిల్ కృంగిపోయిన దృశ్యాలు ఆయన అంత్యక్రియల్లో ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ‘బిగ్ బాస్ 13’ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ జంటను “సిడ్‌నాజ్” అని అభిమానులు పిలుచుకునేవారు.

View this post on Instagram

A post shared by John Cena (@johncena)

Related Articles

Latest Articles

-Advertisement-