NTV Telugu Site icon

భిన్నత్వంలో ఏకత్వం… షారుఖ్ పిక్ వైరల్

shah rukh-khan

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి నివాళులు అర్పించడానికి షారుఖ్ తన మేనేజర్ పూజా దద్లానితో కలిసి వచ్చారు. లతా పార్థివదేహానికి షారుఖ్ ముస్లిం పద్దతితో ప్రార్థన చేయగా, పూజా మాత్రం హిందువుల పద్ధతిలో ఆమె ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించింది.

Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ

అయితే ఒకేసారి రెండు మతాలకు సంబంధించిన పద్ధతుల్లో ఇద్దరూ కలిసి ప్రార్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది. షారుఖ్, పూజాల పిక్ వైరల్ కాగా, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ పూల గుత్తితో వచ్చి, వాటిని శవపేటికపై ఉంచి, దువా అర్పించి, ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేసి, లతా మంగేష్కర్ పాదాలను తాకడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.