NTV Telugu Site icon

Mahesh Babu: తమిళ తంబీలు ‘గిల్లి’ మరీ తిట్టించుకున్నట్టున్నారే

Mahesh

Mahesh

Mahesh Babu: ఒరిజినల్.. ఎప్పుడైనా ఒరిజినలే. ఎంత దాన్ని కన్నా ఎక్కువ చేసినా, చూపించినా ఆ ఒరిజినల్ అలాగే కనిపిస్తోంది. అది వస్తువు అయినా.. సినిమా అయినా సరే. రీమేక్.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న పదం. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో కథను మార్చకుండా వాళ్ల నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని సినిమాను తెరకెక్కిస్తారు. ఎంత మార్పులు చేర్పులు చేసినా.. రీమేక్ ఎప్పుడు రీమేక్ గానే ఉంటుంది ఒరిజినల్ అవ్వదు. ఇది నమ్మదగ్గ నిజం. అయితే కొన్ని సినిమాలు ఒరిజినల్, రీమేక్ రెండు హిట్ అందుకుంటాయి. ఇంకొన్ని సినిమాలు ఒరిజినల్ హిట్ అయినా రీమేక్ మాత్రం బోల్తా పడుతుంది. ఇప్పుడు ఈ ఒరిజినల్ గోల ఎవరు తెచ్చారు అంటే .. ఇంకెవరు తమిళ తంబీలు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. హిట్ అందుకున్న సినిమాల్లో సగానికి సగం రీమేక్ లే అన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి గిల్లి. అదేనండీ మన తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, మహేష్ కెరీర్ లోనే ఒకట్రెండ్ సెట్ చేసిన సినిమా.

Sai Dharam Tej: మెగా మేనల్లుడు లుంగీ వెనుక ఉన్న రహస్యం ఇదా..?

ఇక ఈ సినిమాను విజయ్ గిల్లి అనే పేరుతో రీమేక్ చేశాడు. మహేష్ సరసన ఇక్కడ భూమిక నటించగా.. అక్కడ విజయ్ సరసన త్రిష నటించింది. గిల్లి కూడా విజయ్ కెరీర్ లో ఒక మైలు రాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 19 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తమిళ తంబీలు కొద్దిగా నోరు జారారు. ఒరిజినల్ కన్నా రీమేకే బావుంటుందని, మహేష్ కన్నా విజయ్ బాగా చేశాడని డప్పు కొంటుకుంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా తెలుగును కానీ, మన హీరోలను కానీ ఏదైనా అంటే ఊరుకొని అభిమానులు ఏకంగా మహేష్ బాబునే అనేసరికి ఊరుకొంటారా ..? గిల్లి సీన్స్ ను, ఒక్కడు సీన్స్ ను పక్క పక్కన పెట్టి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గిల్లి బావుంటుంది అన్న మాట వరకు ఓకే. కానీ, హీరోలను పోలుస్తూ ట్రోల్ చేయడంతో మనోళ్లు ఏకిపారేస్తున్నారు. ఎందుకురా గిల్లి మరీ మా చేత తిట్టించుకుంటారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరి ఇదెక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Show comments