NTV Telugu Site icon

Pushpa2 : పుష్ప 2 వాయిదా పై ఫ్యాన్ ఫైర్.. ఏకంగా హీరోకే వార్నింగ్ ఇచ్చాడుగా..

Pushpa 2

Pushpa 2

Fan Warning to Allu Arjun on Pushpa 2 Postponement: టాలీవుడ్ స్టార్ హీరో,ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి మొన్నటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా సినిమా విడుదల వాయిదా పడినట్లు వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది..

గతంలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకేక్కుతుంది.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. పుష్ప టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది.. పుష్ప టైటిల్ సాంగ్ కన్న ఎక్కువగా పాపులారిటిని సంపాదించుకుంది..

తాజాగా సినిమాను ఆగస్టు కాకుండా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. అదే పోస్టర్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. దానికి ఓ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..పుష్ప-2 సినిమాను ముందుగా అనుకున్న టైం కే రిలీజ్ చెయ్యాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.. ఒకవిధంగా హీరోకే వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది.. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. దీని పై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..

Allu arjun, pushpa 2,sukumar, fans, movie updates, social media, viral news

Show comments