Nandamuri Balakrishna: సెలబ్రిటీకనిపించగానేసెల్ఫీ అడగడం ప్రతి అభిమాని చేసే పనే.. అభిమానులు సెల్ఫీ అడగగానే తారలు కూడా ఎంతో సంతోషంతో ఇస్తూ ఉంటారు. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.. సెలబ్రిటీస్ పబ్లిక్ ప్రాపర్టీనే .. కానీ వారికి కూడా మనసు ఉంటుంది.. బాధలు ఉంటాయని కొంతమంది అభిమానులు అర్ధం చేసుకోవాలి. తారలు కనిపించడం ఆలస్యం వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా పట్టించుకోకుండా సెల్ఫీలు అడుగుతూ వారిని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది అభిమానులు. తాజాగా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు నందమూరి బాలకృష్ణ. మొదటి నుంచి బాలయ్య అభిమానులతో రూడ్ గా ఉంటారు అనేది అందరికీ తెల్సిన విషయమే.
తనకు నచ్చకుండా ఫోటోలు తీస్తే అభిమాని ఫోన్ పగలడమో, చెంప పగలడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బాలయ్య చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. బాలయ్య చెల్లి ఉమామహేశ్వరి మృతి చెందిన విషయం విదితమే.. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పుట్టెడు దుఃఖంతో ఉన్న బాలయ్యను ఒక అభిమాని సెల్ఫీ కావాలని అడిగాడు. ఎదుటివాళ్ళ బాధను పట్టించుకోకుండా,వారి పరిస్థితిని అర్ధం చేసుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడే వారిని చూసి బాలయ్య ఏం అనాలో తెలియక ఒక నిమిషం అతడిని ఏహ్య భావంతో చూసి మౌనంగా వెళ్లిపోయారు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకేదీ ఉండదేమో సదురు అభిమానికి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
