Site icon NTV Telugu

Rajamouli: మహేష్ కన్నా ముందే మరో హీరోతో జక్కన్న సినిమా?

Rajamouli

Rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సైతం జస్ట్ జక్కన్న ఊ.. అంటే చాలు, సెట్స్‌లో వాలిపోయేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు కానీ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిపోయాడు జక్కన్న. వాస్తవానికైతే పదేళ్ల క్రితమే మహేష్‌, రాజమౌళి ప్రాజెక్ట్ రావాల్సింది కానీ ఫైనల్‌గా ట్రిపుల్ ఆర్ వంటి ఆస్కార్ క్రేజ్‌ తర్వాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు జక్కన్న. ఆగష్టులో అనౌన్స్మెంట్ ఇచ్చి, ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ కోసం దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత.. జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

కుదిరితే ప్రభాస్, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమాలు చేసే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మాత్రం అస్సలు ఊహకి కూడా అందట్లేదు. అసలు మహేష్‌ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రావడానికే టైం పడుతుంది అంటే అప్పుడే రాజమౌళి బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే రూమర్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇది 100% జస్ట్ గాసిప్పే అయినా న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌ వీర్ సింగ్‌తో రాజమౌళి సినిమా చేసే ఛాన్స్ ఉందని బీటౌన్ మీడియా కథనాలు రాస్తోంది. జక్కన్న గురించి తెలిసిన ఎవరైనా ఈ వార్తని సిల్లీగానే చూస్తారు.

ఎందుకంటే రాజమౌళి ఒక హీరోతో సినిమా చెయ్యాలి అంటే దానికి ముందు నుంచి చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. తాను మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వరకూ జక్కన్న, తన హీరో  విషయాన్ని అనౌన్స్ చెయ్యడు. అలాంటిది ఇంటెర్నేషనల్ వేదికలపైన కూడా SSMB 29 గురించి మాట్లాడిన జక్కన్న అది పక్కన పెట్టి రణవీర్ సింగ్ తో సినిమా చెయ్యబోతున్నాడు అంటే ఎలా నమ్ముతారు? ముందు మహేష్ బాబు సినిమా అనౌన్స్ అయ్యి, సెట్స్ పైకి వెళ్లి, షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని, ప్రమోషన్స్ కోసం ప్రపంచమంతా తిరిగి SSMB 29కి సంబంధించిన అన్ని పనులు అయిపోయిన తర్వాతే.. రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరనేది క్లారిటీ రానుంది.

Exit mobile version