Site icon NTV Telugu

Fahadh Faasil: 73 ఏళ్ళ వయస్సులో ఆ పరీక్షలు.. ఫహాద్ రీల్ తల్లి సాహసం

Leena

Leena

Fahadh Faasil:మలయాళ నటి లీనా ఆంటోనీ.. తెలుగులో ఈమె ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మలయాళంలో మంచి నటి. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన మహిశింటే ప్రతీకారమ్ చిత్రంలో అతని తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోలకు తల్లిగా, పలు పాత్రల్లో నటిస్తున్న ఆమె 73 ఏళ్ల వయస్సులో గొప్ప సాహసం చేసింది. అందరూ శభాష్ అనేలా పదవ తరగతి పరీక్షలను రాస్తూ కనిపించింది.

సోమవారం చేర్తాల గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌‌‌లో లీనా పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యింది. ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మృత్యువాత పడడంతో మిగతా చదువును పూర్తిచేయలేకపోయింది. ఆ తర్వాత కుటుంబ భారం మోయలేక, ఆమెను చదివించలేక లీనకు పెళ్లి చేసేశారు. ఇక పెళ్లి తరువాత కుటుంబం, పిల్లలతో లీనా జీవితం సాగిపోతూ వస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో కొడుకు, కోడలు, సన్నహితుల ప్రోత్సాహంతో ఆమె పదవ తరగతి పరీక్షలు పూర్తి చేయాలనీ నిర్ణయించుకొంది. ఇక ఎంతో శ్రద్ధతో ఆమె ఈ పరీక్షలకు సన్నద్దమయ్యి రాసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ ఏజ్ లో ఆమె చేసిన సాహసానికి అందరూ ఫిదా అవుతున్నారు. తప్పకుండా ఆమె అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం లీనా పరీక్ష రాస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version