Fahadh Faasil: 73 ఏళ్ళ వయస్సులో ఆ పరీక్షలు.. ఫహాద్ రీల్ తల్లి సాహసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil:మలయాళ నటి లీనా ఆంటోనీ.. తెలుగులో ఈమె ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మలయాళంలో మంచి నటి. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన మహిశింటే ప్రతీకారమ్ చిత్రంలో అతని తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోలకు తల్లిగా, పలు పాత్రల్లో నటిస్తున్న ఆమె 73 ఏళ్ల వయస్సులో గొప్ప సాహసం చేసింది. అందరూ శభాష్ అనేలా పదవ తరగతి పరీక్షలను రాస్తూ కనిపించింది.
సోమవారం చేర్తాల గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో లీనా పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యింది. ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మృత్యువాత పడడంతో మిగతా చదువును పూర్తిచేయలేకపోయింది. ఆ తర్వాత కుటుంబ భారం మోయలేక, ఆమెను చదివించలేక లీనకు పెళ్లి చేసేశారు. ఇక పెళ్లి తరువాత కుటుంబం, పిల్లలతో లీనా జీవితం సాగిపోతూ వస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో కొడుకు, కోడలు, సన్నహితుల ప్రోత్సాహంతో ఆమె పదవ తరగతి పరీక్షలు పూర్తి చేయాలనీ నిర్ణయించుకొంది. ఇక ఎంతో శ్రద్ధతో ఆమె ఈ పరీక్షలకు సన్నద్దమయ్యి రాసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ ఏజ్ లో ఆమె చేసిన సాహసానికి అందరూ ఫిదా అవుతున్నారు. తప్పకుండా ఆమె అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం లీనా పరీక్ష రాస్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!