Mahesh Babu has reportedly been paid 5 crore rupees to lend his voice to PhonePe: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమాకి మిక్స్ రివ్యూస్ వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయని సినిమా యూనిట్ ప్రకటించింద. తమకు రివ్యూస్ తో పనిలేదు కానీ కలెక్షన్స్ తో తమ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ కాబట్టి సినిమా హిట్ అని ప్రకటించింది. ఇక ఆ సినిమా సంగతి అలా ఉంచితే తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు మహేష్. అంతకంటే ముందే ఫోన్ పే యాప్ కోసం మహేష్ బాబు చేసిన వాయిస్ ఓవర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే ద్వారా షాపులలో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ అందిందంటూ ఒక వాయిస్ ఓవర్ బయటకు వినిపిస్తుంది.
OTT Viewers : ఓటీటీ ఎక్కువ వాడేదెవరో తెలిస్తే షాకవుతారు!
ఆ వాయిస్ ఎవరిదో ఎందుకు? మహేష్ లాంటి స్టార్ దైతే బాగుంటుందని భావించి ఫోన్ పే మహేష్ తో అగ్రిమెంట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇప్పించింది. అంతేకాదు ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించింది. ఇక మహేష్ ఆ 5 సెకన్ల వాయిస్ ఓవర్ కోసం ఐదు కోట్లు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన టీం చెబుతోంది. మహేష్ రెమ్యునరేషన్ తీసుకున్న మాట వాస్తవమే కానీ అది వాయిస్ ఓవర్ కోసం కాదు ఆయన ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని యాడ్స్ చేయడమే కాదు అగ్రిమెంట్ ప్రకారం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. కేవలం వాయిస్ ఓవర్ కోసమే రెమ్యునరేషన్ అనే మాట వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు.
