Darshan Gang Torcher to Renuka Swamy before Murder: కన్నడ హీరో దర్శన్ అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. అదేమంటే ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపిన హీరో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రేణుకా స్వామి మృతదేహంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయని కూడా గుర్తించారు.
Pavitra Cube: కన్నడ సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ‘పవిత్ర’లు
ఇక ఈ దాడి సమయంలో రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసిన నటుడు దర్శన్ గ్యాంగ్ శాఖాహారిగా ఉన్నప్పటికీ నాన్ వెజ్ బిర్యానీ తినిపించినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్న క్రమంలో హత్య కేసును విచారిస్తున్న పోలీసులు దీనిపై స్పష్టత ఇస్తూ అది నిజం కాదని కొట్టిపారేశారు. రేణుకాస్వామికి బిర్యానీ తినిపించారు, నిరాకరించినందుకు మరింత దాడి చేసినట్లుప్రచారం జరిగింది. కానీ ఇది నిజం అని ఇప్పటివరకు విచారణలో తెలియలేదు. కాబట్టి బలవంతంగా బిర్యానీ తినిపించారనేది సత్యదూరమని పోలీసులు స్పష్టం చేశారు. నేరానికి ఉపయోగించిన కారు యజమానిని పోలీసులు విచారించారు. నోటీసుల నేపథ్యంలో ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన ఇద్దరినీ విచారించి, చాలా సమాచారం సేకరించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.