NTV Telugu Site icon

F3: ట్విట్టర్ రివ్యూ

F3 Movie

F3 Movie

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ రోజు విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ ఎంటర్టైనర్ గా ఉందని ట్విట్టర్ రివ్యూను బట్టి చూస్తే తెలుస్తోంది. సినిమాలో కామెడీ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ సమేతం చూడవచ్చని ఫన్.. విత్ ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలో వెంకీ, వరణ్ తేజ్ కామెడీ సూపర్బ్ గా ఉందంటున్నారు అభిమానులు. సినిమా ఊర మాస్గా ఉందని.. వెంకీ టైమింగ్ అదిరిందని చెబుతున్నారు ఫ్యాన్స్. ఎఫ్ 3 బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. హిలేరియస్ కామెడి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉందని ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి మ్యాజిక్ చేశాడని మూవీ చూసిన వాళ్లు రివ్యూ ఇస్తున్నారు.

ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 కూడా హిట్ కొట్టడంతో ఇటు వెంకీ, అటు మెగా అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన ఎఫ్ 3లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కు జోడీగా తమన్నా, మెహ్రీన్ కనిపించారు. ఎఫ్ 2లాగే ఎఫ్ 3లో కూడా వీళ్ల కాంబినేషన్ మ్యాజిక్ చేసింది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు కుటుంబ సమేతంగా చూసేందుకు సినిమా టికెట్ ధరలు పెంచలేదని తెలుస్తోంది. దీంతో సాధారణ ధరలకే ఎఫ్ 3 కావాల్సినంత వినోదాన్ని పంచనుంది.