విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘F3’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. F2 మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మే 27న విడుదలైన F3 మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అలీ, రఘుబాబు కామెడీ కూడా ప్రేక్షకులకు వీనుల విందు అందించింది. ఈ నేపథ్యంలో జూలై 22 నుంచి ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోనీ లివ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Read Also: BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే
ఈ సినిమాలో వెంకటేష్ రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్ నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించాడు. వెంకేటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించారు. సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే అదనపు ఆకర్షణగా నిలిచారు. ఈ మూవీలో వీళ్లిద్దరూ చెరో ఐటం సాంగ్‌లో కనిపించారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
