సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న “ఎఫ్ 3”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 సంక్రాంతి సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటికే నలుగురు హీరోలు సిద్ధమయ్యారు. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న విడుదల కానుండగా, ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, ‘సర్కారు వారి పాట’ జనవరి 13న, ‘రాధే శ్యామ్’ జనవరి 14 తేదీల్లో విడుదల కానుంది. మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఎఫ్3” సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావిస్తుండగా, తాజాగా మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టమైంది. 2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also : మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన
Also Read
ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి “ఎఫ్ 3” సంక్రాంతి రేసులో పోటీ పడబోతోందని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. శివరాత్రి కానుకగా కాస్త ముందుగానే ‘ఎఫ్ 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
-
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్‌పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!