NTV Telugu Site icon

Samantha : విడాకులపై వివరణ తప్పదా..!

New Project (2)

New Project (2)

 

స్టార్ బ్యూటీ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పటి వరకు ఇండైరెక్ట్‌గా తప్పితే.. డైరెక్ట్‌గా ఎప్పుడు స్పందించలేదు. అయితే ఈ సారి మాత్రం విడాకులపై నోరు విప్పబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఓ ప్రముఖ షో వేదికగా మారబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా సామ్ డివోర్స్ పై స్పందించిందా.. అసలు ఆ షోలో పాల్గొందా.. నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది.

వివాహ బంధంతో నాలుగేళ్లు కలిసున్న నాగ చైతన్య, సమంత.. ఊహించని విధంగా విడాకులు తీసుకొని.. ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. దాంతో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ.. ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా.. చై, సామ్ డివోర్స్ వ్యవహారం తెరపైకి వస్తునే ఉంది. కానీ అటు సమంత గానీ, ఇటు చైతన్య గానీ.. ఏదో మాట వరసకు తప్పితే.. అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు. దాంతో అసలెందుకు ఈ జంట విడిపోయారనేది.. ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పడబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా చేస్తోన్న’కాఫీ విత్‌ కరణ్‌’ షో.. ఇప్పటి వరకు ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఏడో సీజన్‌ మొదలు కాబోతోంది. అయితే ఈ సారి ఓటీటీలో ప్రసారం కాబోతోంది ఈ పాపులర్ షో. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లే ఈ షోలో అటెండ్ అయ్యారు. కానీ ఈ సారి మాత్రం సౌత్ స్టార్స్ టార్గెట్‌గా రాబోతోంది కాఫీ విత్ కరణ్. అందులో భాగంగానే.. తాజాగా ఈ షోలో సమంత కూడా పాల్గొన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రీసెంట్‌గా ఆమె షూట్‌లో పాల్గొందని.. విడాకుల విష‌యంపై కూడా నోరు విప్పింద‌ని సమాచారం. దాంతో డివోర్స్ గురించి సమంత నిజంగానే క్లారిటీ ఇచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.