ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా పరాజయమెరుగుని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి 2022 సమ్మర్ లో రావచ్చని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల కెరీర్ ని ఫణంగా పెట్టి నటించారు తారక్, చెర్రీ. ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ కి అన్ని భాషల్లోనూ అనూహ్యమైన ఇమేజ్ వచ్చింది. దానికి కారణం రాజమౌళి అనే చెప్పవచ్చు. రాజమౌళి దీనికి ముందు ‘బాహుబలి’ సీరీస్ తో వరల్డ్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు. దాంతో ‘ఆర్ఆర్ఆర్’పై అనూహ్యమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలకు ఆకాశమే హద్దు అయింది. ఇక జనవరి 7న విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో ఇండియాలోని ప్రధాన నగరాలలో సందడి చేసింది యూనిట్.ఒక్కసారిగా సినిమా విడుదల వాయిదా పడటంతో యూనిట్ మొత్తం సైలెంట్ అయిపోయింది.
ఇదిలా ఉంటే రాజమౌళిపై నమ్మకంతో ఈ సినిమా కోసం మూడేళ్ళ కెరీర్ వదలుకున్నారు ఎన్టీఆర్, చరణ్. నిజానికి వీరు ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల వరకూ తీసుకుంటుంటారు. ఈ లెక్కన విడి విడిగా ఏడాదికి ఒక్కో సినిమా చేసుకున్నా మూడేళ్ళకు 60 కోట్లకు పైగా గిట్టుబాటు అయిఉండేది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వీరిద్దరికీ 50 కోట్ల వరకూ పారితోషికంగా ముట్టనున్నట్లు అనధికారిక సమాచారం. ఈ విషయంలో స్టార్ హీరోలు ఇద్దరూ కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గుంభనంగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మాత్రం బాహాటంగానే అక్కసు వెళ్ళగక్కినట్లు వినికిడి. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావిస్తూ జక్కన్న వద్దకు పంచాయితీని తీసుకువెళ్ళాలనే ఆలోచనను వ్యక్తం చేశారట. ప్రస్తుతానికి సినిమా వాయిదా పడటంతో అంతా ప్రశాంతంగా ఉంది. మరి సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాక మళ్ళీ ఈ రెమ్యునరేషన్ లొల్లి బయటకు వస్తుందేమో చూడాల