Site icon NTV Telugu

Bigg Boss OTT తెలుగులో ఈ ఎక్స్ కంటెస్టెంట్లు

Bigg Boss OTT

బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్‌లలో ఒకటి ‘బిగ్ బాస్ తెలుగు OTT’ వెర్షన్. ఇది 12 వారాల పాటు నడుస్తుంది. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షో హాట్‌స్టార్ యాప్‌లో ప్రసారం అవుతుంది. వీక్షకుల కోసం 24×7 రన్ అవుతుంది. ఇక మరోవైపు ఈ షోకు సంబంధించిన రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో కంటెస్టెంట్స్ గురించి కూడా. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, నిఖిల్ వంటి వారు ఈ జాబితాలో ఉండగా, ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే కొంతమంది బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు షోలో కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి.

Read Also : భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్

హాటీ ముమైత్ ఖాన్, నటి తేజస్వి మదివాడ, హీరో ప్రిన్స్ మరోసారి ప్రోగ్రామ్‌లో చేరడానికి సంతకం చేసినట్లు చెబుతున్నారు. ఇక సీజన్ 4 నుంచి అరియనా, అఖిల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. #BiggBossOTT తెలుగు ఫిబ్రవరి 21 నుండి ప్రారంభమవుతుంది. పోటీదారులు ప్రోగ్రామ్ ప్రారంభానికి ఒక వారం ముందు ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. ఈ కొత్త షో కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్‌ను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి బిగ్ బాస్ బృందం పలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Exit mobile version