NTV Telugu Site icon

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే ఎవరూ నమ్మలేదు…

Payal Ghosh

Payal Ghosh

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకీ ఈ పాయల్ ఘోష్ ఎవరా అని ఆలోచిస్తున్నారా?  మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన బెంగాళీ బ్యూటీనే ‘పాయల్ ఘోష్’. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊసరవెల్లి’ సినిమా గుర్తుందా? తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన అమ్మాయే ‘పాయల్ ఘోష్’.

Read Also: NTR: బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్.. ఆస్కార్ కోసమేనా..?

2011లో వచ్చిన ఈ మూవీలో ‘చిత్ర’గా నటించిన పాయల్ ఘోష్ ప్రస్తుతం సినిమాలు చెయ్యకుండా రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. 2017లో చేసిన హిందీ ప్రాజెక్ట్ తర్వాత పాయల్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే 2020లో పాయల్ ఘోష్, ‘ఎన్టీఆర్’ గ్లోబల్ ఫేస్ అవుతాడని ఆమె సన్నిహిత వర్గాలతో ఛాలెంజ్ చేస్తే… అందరూ నవ్వారని, ఈరోజు అదే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని. తన గెస్ ఎప్పుడూ మిస్ అవ్వదని పాయల్ గోష్ ట్వీట్ చేసింది. నందమూరి అభిమానులు పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ పాయల్ ఘోష్ కి రీచ్ పెంచుతున్నారు.

Read Also: NTR Trivikram: మళ్లీ మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్…

Show comments