Site icon NTV Telugu

Shriya Saran: ఎలా బేబీ.. తల్లి అయ్యాక కూడా ఇంత అందం మెయింటైన్ చేస్తున్నావ్

Shriya

Shriya

Shriya Saran: ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రియా శరన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును తన కొంగుకు కట్టేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్లలో శ్రియా ముందు ఉందని చెప్పొచ్చు. అమ్మడు ఎంత బోల్డ్ గా ఉంటుందో ఆమె చేసే పనులే చెప్తాయి. ఎక్కడకు వెళ్లినా.. దాపరికాలు శ్రియాలో ఉండవు. అది బట్టల్లో అయినా.. భర్తకు చూపించే ప్రేమలో అయినా.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ముద్దుగుమ్మ ప్రేమించినవాడిని పెళ్ళాడి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక సీక్రెట్ గా బిడ్డను కని.. ఆమె పేరు రాధ అంటూ అభిమానులకు పరిచయం చేసి కుర్రాళ్ళ హృదయాలను ముక్కలు చేసింది. సరే.. మేము ఎలా ఉన్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకున్నారు.

NTR30: టాలీవుడ్ కుర్రాళ్ల కళ్లన్నీ జాన్వీ పాప మీదనే..

ఇక సాధారణంగా పెళ్లి, పిల్లలు పుట్టాకా ప్రతి అమ్మాయిలోనూ చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పిల్లలు పుట్టాకా బరువు పెరుగుతారు. శ్రియా విషయంలో కూడా అది జరిగింది. అది నిజం.. కానీ, ఆ బరువు నుంచి ఆమె నార్మల్ గా రావడానికి ఎంత కష్టపడిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ చిన్నదాన్ని చూస్తే.. దేవుడా.. ఈమెకు పెళ్లి అయ్యి.. ఒక కూతురు కూడా ఉందా అని అనకుండా మానరు. సోషల్ మీడియాలో కుర్ర హీరోయిన్లకు తగ్గట్టు అమ్మడు చేసే బోల్డ్ ఫోటోషూట్స్ గురించి అసలు చెప్పనవసరం లేదు. ఇక తాజాగా శ్రియ..మల్టీకలర్ అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది. ఆ నడుము.. ఆ నవ్వు.. అబ్బబ్బ.. ఏమైనా ఉందా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా శ్రియ అభిమాన సంఘం అయితే ఎలా బేబీ.. తల్లి అయ్యాక కూడా ఇంత అందం మెయింటైన్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శ్రియ కబ్జా సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version