బుల్లితెరపై ఎన్టీఆర్ మ్యాజిక్… షాకింగ్ టిఆర్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జెమిని టివి సరికొత్త షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో టెలివిజన్ రంగంలోకి హోస్ట్ గా మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకుముందు పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్”కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసారమైన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కర్టెన్-రైజర్ ఎపిసోడ్ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న షోకు చరణ్ ముఖ్య అతిథిగా రావడం అందరిలో ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ షో రేటింగ్‌లు వచ్చాయి. “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. వారంలో ఈ షో సగటు రేటింగ్ 5.6. ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా పని చేయడంతో జెమిని టీవీ 290 జిపిఆర్ నుండి 400 జిపిఆర్ కు వెళ్లింది.
Read Also : ‘మా’ లెక్కలు మారుతున్నాయ్
Also Read
2014లో “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే పేరుతో ఈ షోను కింగ్ నాగార్జున హోస్ట్ చేసేవారు. ఆ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ కు 9.7 టిఆర్పీని తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్ వెర్షన్ నాగార్జున వెర్షన్ కంటే మెరుగైన రేటింగ్స్ పొందింది. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఊపందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..