NTV Telugu Site icon

King Nag: నా సామిరంగ… మంచి మెలోడితో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు

King Nag

King Nag

అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. మంచి అనౌన్స్మెంట్ వీడియోతో స్టార్ట్ అయిన నా సామిరంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వర్క్స్ జరుపుకుంటుంది. సంక్రాంతి సీజన్ లో నాగార్జున నుంచి సినిమా వస్తే పోటీగా ఎన్ని మూవీస్ వచ్చినా నాగార్జున హిట్ కొట్టడం గ్యారెంటీ. ఇప్పుడు కూడా అదే ధీమాతో నా సామిరంగ సినిమా సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. తన 99వ సినిమా అయిన నా సామిరంగ కోసం నాగార్జున కంప్లీట్ విలేజ్ లుక్ లోకి మారిపోయాడు. లాంగ్ హెయిర్, లైట్ గా గడ్డంతో నాగార్జున ఎవర్ చార్మింగ్ గా ఉన్నాడు. నాగార్జున పక్కన అమిగోస్ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరి పైన కంపోజ్ చేసిన “ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే” సాంగ్ ని లాంచ్ చేసారు.

ఈ పాట నా సామిరంగ మూవీ నుంచి వచ్చిన మొదటి ప్రమోషనల్ కంటెంట్. ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ కీరవాణి, చంద్రబోస్ కలయికలో వచ్చిన ఈ మెలోడీ వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. రామ్ మిర్యాల వోకల్స్ “ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే” సాంగ్ ని ఇన్స్టాంట్ గా హమ్ చేసేలా చేసాయి. మంచి విలేజ్ నేటివిటీతో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్ ని షూట్ చేసారు. నాగార్జున-ఆషిక కాంబినేషన్ కూడా సెట్ అవ్వడంతో సాంగ్ మరింత అందంగా ఉంది. డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ ఖోరియోగ్రాఫర్ కూడా కావడంతో సాంగ్ లో చిన్న చిన్న మూవ్మెంట్స్ ని కూడా బాగా క్యాప్చర్ చేసాడు. మెలోడీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇక్కడి నుంచి నా సామిరంగ ప్రమోషన్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నాగ్ సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి నిజం చేసినట్లే.

Show comments