Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ, అచ్చ తెలుగందం ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందం, అభినయం ఉన్నా ఈషా ఎందుకో స్టార్ గా వెలుగలేకపోయింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తెమిల్ లో తన లక్ ను పరీక్షించుకోవడానికి వెళ్ళింది.
ఇక అక్కడే ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రేమ పెళ్లి వరకు వచ్చిందని, త్వరలోనే ఈ జంట పెళ్ళికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదురు డైరెక్టర్.. తమిళ్ లో మంచి హిట్ మూవీస్ ను డైరెక్ట్ చేశాడట. ఇరుకుటుంబాలను ఒప్పించి ఈ జంట ఒక్కటి కాబోతున్నారని టాక్. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్త తెలియడంతో ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారట. ఇకపోతే ఈషా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ పెళ్లి వార్తలపై ఈ భామ స్పందిస్తుందేమో చూడాలి.