సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎదగడం ఎంతో కష్టం.. అందులోను ఒక హీరోయిన్ గా ఎదగాలంటే తన శరీరాన్ని పణంగా పెట్టాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. మరికొందరు కొన్ని అవమానాలను దిగమింగుకొని స్టార్ అయ్యాకా తాము పడిన కష్టాలను చెప్పుకొస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకురావడం షాక్ కి గురిచేస్తోంది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోమని ఇద్దరు దర్శకులు డైరెక్ట్ గానే అడిగిరాని తెలిపింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈషా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లానని, అక్కడ నిర్మాత తనతో అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది. ఆయనకు భయపడి అర్ధరాత్రి మేకప్ ఆర్టిస్ ని పడుకోమనేదానన్నిచెప్పుకొచ్చింది. మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా అవకాశం కావాలంటే తమతో రూమ్ కి రావాలని కోరినట్లు తెలిపింది. వాటన్నింటిని ఎదుర్కొని నిలబడగలిగానని తెలిపిన ఈషా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదని తెగేసి చెప్పింది. స్టార్స్ వారసులకైతే ఇలాంటివి ఉండవు కానీ.. బయట నుంచి వచ్చే అమ్మాయిలకు మాత్రం ఎక్కడో ఒకచోట క్యాస్టింగ్ కౌచ్ తప్పడం లేదని తెలిపింది. బాలీవుడ్ లో ప్రత్యేక పాటలతో మెప్పిస్తున్న ఈషా తెలుగులో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చెర్రీతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.