Site icon NTV Telugu

Ante Sundaraniki: చిత్రమైన ఉత్సవాలలో మునిగితేలుతోన్న సుందరం జంట

Entha Chitram Song From Ante Sundaraniki

Entha Chitram Song From Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘అంటే సుందరానికీ’ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్ల వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అనే లిరికల్ పాట విడుదల అయ్యింది. ‘‘ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు’’ అంటూ సాగే ఈ పాట మెలోడియస్‌గా, వినసొంపుగా ఉంది. తన గాత్రంతో సింగర్స్ అనురాగ్ కులకర్ణి, ఆ మాయాలోకంలోకి తీసుకెళ్ళాడు అనురాగ్ కులకర్ణి. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సూధింగ్ &  రొమాంటిక్ పాటల్లో ఇది ద బెస్ట్‌గా నిలవడం ఖాయంలా కనిపిస్తోంది.

ఇక లిరికల్ వీడియోలోనూ నాని, నజ్రియా జంట చూడముచ్చటగా కనిపించారు. వీరి మధ్య చక్కని కెమిస్ట్రీ కుదిరింది. ఇద్దరూ నేచురల్ స్టార్స్ కావడం వల్ల, జోడీ బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. చూస్తుంటే, చాలాకాలం తర్వాత మనమంతా ఓ చక్కని రొమాంటిక్ సినిమాని చూడబోతున్నామన్న భావన కలుగుతోంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా పుష్కలంగా ఉండనున్నట్టు ఆల్రెడీ రిలీజైన టీజర్‌తో స్పష్టమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కతోన్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా జూన 10వ తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

 

Exit mobile version