NTV Telugu Site icon

Emraan Hashmi: టీ షర్ట్ మర్చిపోయాను అంటున్న OG విలన్..

Imran

Imran

Emraan Hashmi: బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సినిమాలకు ఇమ్రాన్ పెట్టింది పేరు. ఇక ఈ హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలకు.. హిందీ విలన్స్ ఎక్కువ అయ్యారు. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో విలన్ గా పెడుతున్నారు. అదే ట్రెండ్ గా నడుస్తోంది. ఈ ట్రెండ్ నే కుర్ర డైరెక్టర్ సుజీత్ కూడా ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో OG సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏపీ ఎలక్షన్స్ వలన వాయిదా పడింది. త్వరలోనే ఈ షూట్ మొదలుకానుంది.

ఇకపోతే OG లాంటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఇమ్రాన్ తన అదృష్టమని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇమ్రాన్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా ఈ బాలీవుడ్ కిస్సర్ టీ షర్ట్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి షాక్ ఇచ్చాడు. మళ్లీ నేను నా టీ షర్ట్ ను వేసుకోవడం మర్చిపోయాను అని క్యాప్షన్ గా పెట్టాడు. బాలీవుడ్ రొమాంటిక్ హీరో బాడీ.. సిక్స్ ప్యాక్ తో అదరగొడుతుంది. అమ్మాయిలు అయితే ఫిదా అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి OG సినిమాతో ఇమ్రాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments