Emma Watson To Enter in Politics: ‘హారీ పాటర్’ సిరీస్ చూసిన వారందరికీ అందులో హెర్మాయోన్ గ్రాంగర్ పాత్ర ధరించిన ఎమ్మా వాట్సన్ గుర్తుండే ఉంటుంది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిసారి ఆ పాత్రలో తెరపై తళుక్కుమన్న ఎమ్మా వాట్సన్ ‘హారీ పాటర్’ఎనిమిది భాగాల్లోనూ నటించింది. ఆ ఒక్క సినిమాతోనే సెలబ్రిటీ స్టేటస్ అందుకుంది. ఆ పై ఎమ్మా యాక్టివిస్ట్ గానూ ఆపన్నులకు చేతనైన సాయం చేస్తూ సాగింది. ఆమె మంచితనం వల్ల బ్రిటన్ లో జనం ఎమ్మాపై అభినందన జల్లులు కురిపించారు. 2014లో ‘పాడింగ్టన్’ యానిమేటెడ్ మూవీ విడుదల సమయంలో ఎమ్మా ఓ పాడింగ్టన్ బేర్ విగ్రహాన్ని డిజైన్ చేసింది. ఆ బొమ్మను వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని బ్రిటన్ లోని బాలల సంరక్షణ నిధికి అందచేసింది. దాంతో వాట్సన్ పేరు మారుమోగిపోయింది. 2015లో మహిళలకు సమానహక్కులు అంశంపై ఎమ్మా ఇచ్చిన ప్రసంగం ఈ నాటికీ అక్కడి మహిళలు స్మరిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఎమ్మా వాట్సన్ ను కొందరు “రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా?” అని ప్రశ్నించారు. అందుకు ఇంకా సమయం ఉందని సెలవిచ్చింది ఎమ్మా. అంటే ఆమెకు రాజకీయాలంటే ఆసక్తే అన్నమాట!
Corona Tension: ఏపీ, తెలంగాణల్లో కరోనా టెన్షన్
మరి ఎమ్మా వాట్సన్ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది? అంటూ అభిమానులు ప్రతీసారి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే యుఎన్ ఉమన్ గా పలు దేశాల్లో ఎమ్మా ప్రసంగించింది. ఏప్రిల్ 15తో ఎమ్మా వాట్సన్ 33 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా మొన్న బ్రిటన్ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్ కొద్ది రోజుల్లోనే సరైన బలం లేకపోవడంతో దిగిపోయింది. లిజ్ విఫలమైన నేపథ్యంలో ప్రజల్లో ఎంతో అభిమానం చూరగొన్న ఎమ్మా వాట్సన్ వంటి యువతి రాజకీయాల్లోకి రావడం దేశసౌభాగ్యానికే ఎంతో మేలని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై తన పుట్టినరోజయిన ఏప్రిల్ 15న ఎమ్మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
