Site icon NTV Telugu

EMK ప్రోమో: ఎన్టీఆర్ చాలా డేంజర్ అన్న మహేష్ బాబు

evaru meelo kotiswarulu

evaru meelo kotiswarulu

బుల్లితెరపై ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీల రచ్చ మౌములుగా లేదు. ఇక అందరు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే ఫ్రేమ్ పై కనిపించి రచ్చ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వస్తున్నాడు అంటేనే రచ్చ చేసిన అభిమానులు ఇక తాజాగా ఆ షో ప్రోమో రిలీజ్ కావడంతో పండగ చేసుకుంటున్నారు. ఒకే ఫ్రేమ్ లో ఒక పక్క ఎన్టీఆర్ మరోపక్క మహేష్ బాబు కనిపించేసరికి చూడ్డానికి రెండు కళ్లు చాలవంటున్నారు అభిమానులు.

ఇక ఈ ప్రోమోలో ఎన్టీఆర్ సరదా పంచ్ లు ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని చూపించేసింది. ఎన్టీఆర్ “వెల్ కమ్ టూ మహేష్ అన్న అనడంతో ప్రారంభమైన ఈ ప్రోమో లో మహేష్ ని కఠినమైన ప్రశ్నలు అడిగినట్లే కనిపించాడు ఎన్టీఆర్.. కరెక్ట్ ఆన్సర్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు అని మహేష్ అడుగగా.. సరదాగా అని ఎన్టీఆర్ పంచ్ పేల్చాడు.. దాంతో వెంటనే మహేష్ మీ గురువుగారే బెటర్ ఉన్నారు నీకన్నా” అంటూ నవ్వుతూ చెప్పడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. అయితే ఈ ప్రోమోతో మహేష్ ని చాలా గట్టిగానే ఆడుకున్నట్లు కనిపిచ్న్హడు ఎన్టీఆర్.. మహేష్ నవ్వుతూనే ఎన్టీఆర్ చాలా డేంజరస్ అని చెప్పడం వినోదభరితంగా ఉంది. ఈ ప్రోమోతో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

https://youtu.be/DCwU8pNi9A8
Exit mobile version