Em chestunnav Teaser Launched: యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ సెన్సేషన్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్న క్రమంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ భరత్ మిత్ర మాట్లాడుతూ ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుందని, మంచి సినిమా తీశామని చెప్పారు థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారని అన్నారు.
Koratala Shiva: భోళా దెబ్బకు ట్రెండింగ్‌లో కొరటాల!
సినిమా మస్త్ ఉంటదని, ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకోని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ్ రాజ్ కుమార్ తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఉంటుందని, హాలీవుడ్ సినిమాలో కూడా చూడని ఒక హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుందని అన్నారు. తన జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఏం చేస్తున్నావ్ అని పేర్కొన్న హీరో శ్రీ విష్ణు ఇందులో చాలా అర్థాలు ఉంటాయని, ఇది చాలా మంచి టైటిల్ అని టీజర్ కూడా బాగుందన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించిన ఆయన సాంగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా వేడుక చూస్తుంటే తనకు బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయని కొత్త వాళ్ళందరూ అలాగే ఎదుగుతారని వారి థాట్స్, వారి మాటలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు ఆయన.