Site icon NTV Telugu

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్.. అసలేమైందంటే?

Bigg-Boss

Bigg-Boss

Elvish Yadav Arrest In Snake Venom Case: వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కి వెళ్తున్నారో లేక బిగ్ బాస్ కి వెళ్ళాక వివాదాస్పదంగా మారుతున్నారా తెలియదు కానీ ఎప్పటికప్పడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సైతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రేవ్ పార్టీలో పాము విషం విక్రయిస్తున్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు, ఎల్విష్ యాదవ్ అరెస్టుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. యూట్యూబర్, ‘బిగ్ బాస్ OTT 2’ విజేత ఎల్విష్ యాదవ్ ఒక పాటలో పాముతో కనిపించారు. ఈ క్రమంలోనే ఎల్విష్ యాదవ్‌ను పట్టుకునేందుకు బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ఉచ్చు బిగించింది. రేవ్ పార్టీలో పాము విషాన్ని సరఫరా చేయమని కాల్ చేయడంతో చేసేందుకు సిద్దమైన క్రమంలో నోయిడా పోలీసులు 5 మందిని అరెస్టు చేసి ఎల్విష్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వార్తలు వచ్చాయి. అయితే అరెస్టయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు రాజస్థాన్‌లోని కోటాలో ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Producer Arrested: మహిళా జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన.. సినీ నిర్మాత అరెస్ట్

పోలీసుల దిగ్బంధనాన్ని ఛేదించుకుని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నా పోలీసులు అతన్ని రామ్‌గంజ్ సుకేత్ ప్రాంతంలో పట్టుకున్నారు. మీడియా కథనాల ప్రకారం, రేవ్ పార్టీలో పాము విషాన్ని డ్రగ్‌గా స్మగ్లింగ్ చేసినందుకు పోలీసులు అతని కోసం వెతికి ఆ తర్వాత అతన్ని కోటాలో అదుపులోకి తీసుకున్నారు, అతని కారును కూడా జప్తు చేశారు. అయితే విచారణ అనంతరం అతడిని విడుదల చేశారు. విచారణలో ఎల్విష్ యాదవ్ కారులో ఉన్నట్లు తేలిందని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత కోట పోలీసులు నోయిడా పోలీసులకు సమాచారం అందించారు. నోయిడా పోలీసులతో మాట్లాడిన తర్వాత ఎల్విష్ యాదవ్‌ను విడుదల చేశారు. ఈ కేసులో అతడు వాంటెడ్‌గా లేడని అక్కడి పోలీసులు చెప్పినట్టు డీజీపీ తెలిపారు. ఆ తర్వాత మాత్రమే కోట పోలీసులు యూట్యూబర్‌ను విడిచిపెట్టారు. ప్రస్తుతం, ఎల్విష్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయాడు.

Exit mobile version