Site icon NTV Telugu

Rocking Rakesh: ‘కేసీఆర్’పై చేస్తున్న నా సినిమాని ఎలక్షన్ కమీషన్ ఆపేసింది

Rocking Rakesh

Rocking Rakesh

జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్  బాగా ఇష్టపడుతుంటారు. వేణు, సుధీర్, షకలక శంకర్, ధనరాజ్ బాటలో నడుస్తూ… రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. తానే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి KCR జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది, ఇటీవలె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని త్వరలో విడుదల కావాల్సిన KCR సినిమాకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని రిలీజ్ ని ఆపేస్తు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Devara: అనిరుధ్-ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్… ఈ కాంబినేషన్ స్క్రీన్స్ ని తగలబెట్టేస్తాయి

KCR సినిమా విషయంలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ… “నా సినిమాని నవంబర్ 17న కానీ 24న కానీ రిలీజ్ చెయ్యాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఎలక్షన్ కమిషన్… ఎన్నికల సమయంలో ప్రజలని ప్రేప్రేపించే ఏ రాజకీయ సినిమా రిలీజ్ కాకూడదు అని చెప్తూ నా సినిమా విడుదలని ఆపేసింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, చట్టం ప్రకారమే నా సినిమా రిలీజ్ ఆగింది. ఇది కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే టైమ్ దొరికింది.” అంటూ రాకింగ్ రాకేష్ లైవ్ వీడియోలో చెప్పాడు. మరి తెలంగాణ ఎన్నికల తర్వాత KCR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే కొత్త రిలీజ్ డేట్ విషయంలో రాకేష్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Exit mobile version