‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తరానుసారంగా సాగిన కథనం, రియలిస్టిక్ డైలాగ్స్ తో సంచలనం సృష్టించింది. ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తిరుగుతున్నాయి. దీంతో, దీని సీక్వెల్‌పై ఆసక్తి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
Also Read : Yami Gautam: పాత్ర బలంగా ఉంటే.. స్క్రిప్ట్ కూడా పట్టించుకోను..
ఇప్పటికే టీమ్ నుంచి సీక్వెల్ రాబోతోందన్న సంకేతాలు వస్తుండగా.. తాజాగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ మరోసారి కలసి ఈ ప్రాజెక్ట్‌కి పునాదులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తరుణ్ సోషల్ మీడియాలో స్క్రిప్ట్ రెడీ అయిందని చిన్న హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం.. జూన్ 29న సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. అదే రోజు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ స్పెషల్ డేట్‌కి సీక్వెల్ ప్రకటించడం ఫ్యాన్స్‌కి డబుల్ ఖుషీ ఇవ్వనుంది. ఈ సారి మరింత హైప్ ఉండే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దూసుకెళ్తుందో చూడాల్సిందే..
