NTV Telugu Site icon

Eagle: మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చింది…

Eagle

Eagle

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే.. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, ఐదు సినిమాలు పోటీ పడితే థియేటర్ల సమస్య ఎక్కువగా ఉంటుందని భావించి… ఈగల్‌కు ఫిల్మ్ ఛాంబర్ సోలో రిలీజ్ ఇస్తానని చెప్పడంతో రవితేజ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు అనుకున్న ప్రకారమే తెలుగు నుంచి సోలోగా వస్తుంది ఈగల్. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రోజురోజుకీ హైప్ పెంచే పనిలో ఉన్నారు.

ఈగల్ సినిమా పోస్టర్స్ రవితేజ అభిమానులకే కాదు… రెగ్యులర్ మూవీ లవర్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తున్నాయి. పోస్టర్ డిజైన్ తో పాటు, పోస్టర్ పైన రాస్తున్న హీరో ఎలివేషన్ కొటేషన్స్ కూడా కిక్ ఇస్తున్నాయి. లేటెస్ట్ గా ఈగలు సినిమా రివ్యూ బయటకి వచ్చేసింది. అది కూడా ఫస్ట్ రివ్యూ రవితేజ నుంచే రావడం విశేషం. ఈగల్ సినిమాని చిత్ర యూనిట్ తో పాటు స్పెషల్ షో చూసిన రవితేజ “నేను సూపర్ శాటిస్ఫైడ్” అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. డైరెక్టర్ కి కూడా రవితేజ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వీడియోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఈగల్ సినిమా మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చేయడంతో ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. మరి రవితేజ మాటని నిజం చేస్తూ ఈగల్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి.