Eagle: ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్టార్ హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఇంతకు ముందులా పెద్ద సినిమా అని కానీ, స్టార్ హీరో సినిమా అని కానీ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని కానీ, ఎవరు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది బరిలో నలుగురు స్టార్ హీరోలు, ఒక కుర్ర హీరో ఉన్నారు. గుంటూరు కారం తో మహేష్ బాబు, సైంధవ్ తో వెంకటేష్, ఈగల్ తో రవితేజ, నా సామీ రంగాతో నాగార్జున పోటీపడుతుండగా.. ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ తో పోటీ పడుతున్నాడు. ఇక ఈ ఐదు సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకొని తమ సినిమాలకు ఎక్కువ థియేటర్లు వచ్చేలా శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈగల్.. ఈ రేసు నుంచి తప్పుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి నుంచి తప్పుకొని జనవరి 22 న రిలీజ్ కు రెడీ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ అయ్యింది. అయితే.. ఇవేమి నిజం కాదని తేలిపోయింది. తాజాగా మేకర్స్ ఈగల్ సెన్సార్ పూర్తి అయినట్లు అధికారికంగా తెలిపారు. తమ సినిమాకు యూ/ఏ ఇచ్చారని, అది కూడా ఏ కట్స్ లేకుండా ఇచ్చినట్లు తెలిపారు. ఒకపక్క వాయిదా వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఇంత దైర్యంగా సెన్సార్ అయ్యిందని ఎలా చెప్తారు. అంటే ఈగల్ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకోలేదా అని అంటే.. తప్పుకోలేదని స్పష్టం అవుతుంది. పోస్టర్ లో కూడా జనవరి న ఈగల్ రిలీజ్ అని తెలిపారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
