Site icon NTV Telugu

Eagle: ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే

Supreetha

Supreetha

Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్నీ అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అందించారు. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.

Parvathy Thiruvothu: మొన్న దూత.. నేడు కడక్ సింగ్.. అద్భుతమైన పాత్రలతో అదరగొడుతున్న బ్యూటీ

ఆడు మచ్చ అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు. సాంగ్ ప్రోమో అదిరిపోయింది. దావ్‌జాన్‌డి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మాస్ మహారాజా అనే పేరుకు రవితేజ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఒక మాస్ లీడర్ గా రవితేజ కనిపించాడు. బ్లాక్ కలర్ కుర్తాపై లుంగీ కట్టుకొని.. నుదుటున పెద్ద బొట్టు పెట్టుకొని మాస్ మహారాజా లుక్ అదిరిపోయింది. ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులు ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=JhPTke3uA6A

Exit mobile version