NTV Telugu Site icon

Eagle: విజృంభనమ్.. విధ్వంసమ్.. గరుడమ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ

Ravi

Ravi

Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ వెల్లడించారు. ఫిబ్రవరి 9న ఈగల్‌ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఈగల్ నుంచి 4 వ సాంగ్ ను రిలీజ్ చేశారు. విజృంభనమ్.. విధ్వంసమ్.. గరుడమ్.. అంటూ సాగిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. హీరో ఎలివేషన్ కు తగ్గ లిరిక్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రవితేజ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాయగా శ్రీ కృష్ణ అండ్ టీమ్ అద్భుతంగా ఆలపించారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.