Site icon NTV Telugu

DVV Entertainment: బిల్డప్ ఇస్తే తొక్క తీస్తా… సూపర్ రిప్లై ఇచ్చారు మావా

Dvv Entertainment

Dvv Entertainment

డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈరోజు టాలీవుడ్ లో భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న పెద్ద బ్యానర్స్ లో ఒకటి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ సెట్ చేస్తూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్యానర్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉండే డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో హైపర్ యాక్టివ్ మోడ్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ‘OG’ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ఫాన్స్ ని ఖుషి చేస్తూ ట్వీట్స్, ‘OG’కి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మంచి రీచ్ ని మైంటైన్ చేస్తోంది.

Read Also: Kushi: ‘ఆరా బేగమ్’పై మనసు పారేసుకున్న ‘ది’ దేవరకొండ…

రంజాన్ రోజున ఫాన్స్ ని మట్టన్ బిర్యానీ పంపించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్, లేటెస్ట్ గా రాజస్తాన్ రాయల్స్ ట్విట్టర్ హ్యాండిల్ కి సూపర్ రిప్లై ఇచ్చింది. ‘SSS’ (స్కిప్పర్ సంజు సాంసన్) RRR కన్నా గ్రేట్ అని అర్ధం వచ్చేలా రాజస్తాన్ రాయల్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ ని పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ని చూడగానే డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన రిప్లై చూస్తే నవ్వాగదు. ఇడియట్ సినిమాలోని ఒక క్లిప్ ని పోస్ట్ చేసిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ “బిల్డప్ ఇస్తే తొక్క తీస్తా” అనే డైలాగ్ ని ట్వీట్ చేసింది. సూపర్ రిప్లై ఇచ్చావ్ మావా అంటూ RRR ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ తో సినిమా చేస్తుంటే ఆ మాత్రం పవర్ ఉండడంలో తప్పు లేదు అంటూ పవన్ ఫాన్స్ కూడా DVVకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.

Exit mobile version