NTV Telugu Site icon

DVV Entertainment: రేయ్ ఎవడ్రా నువ్వు.. సుజీత్ ఫొటోకి డీవీవీ షాకింగ్ కామెంట్!

Sujeeth Fake Id Twitter

Sujeeth Fake Id Twitter

DVV Entertainment Clarity on Sujeeth Twitter fake id: సాహో లాంటి సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ సింగ్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ తో ఓజి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్న సుజిత్ సింగ్ తాజాగా ట్విట్టర్లో తన పేరుతో ఉన్న అకౌంట్ కు సంబంధించిన డీపీ మారుస్తూ కొత్త పిక్ పెట్టారు. అయితే దీనికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి కామెంట్ వచ్చింది.

Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకుని కొడతానన్నా!

రేయ్ ఎవడ్రా నువ్వు, గయ్స్ ఇది ఫేక్ అకౌంట్, అసలు సుజిత్ కి ట్విట్టర్ అకౌంట్ లేదని పేర్కొన్నారు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఓజి పై ఆరంభంలోనే హైప్ భారీగా ఉంది. అందుకు తగ్గట్లుగానే ఓజిని క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఓజికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ముంబైలో ప్రారంభం అయింది కూడా, ఇక వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేయగా ఇప్పటి దాకా యాభై శాతం వరకూ టాకీ పార్టును పూర్తి చేసినట్లు చెబుతున్నారు.

Show comments