Site icon NTV Telugu

Skanda: అదిరిపోయే ఫైట్స్ మధ్యలో మంచి పల్లె పాట…

Skanda

Skanda

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని… కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇటీవలే ట్రైలర్ లాంచ్ తో స్కంద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న స్కంద మూవీకి ట్రైలర్ ఇచ్చిన హైప్ కి, రిలీజ్ రోజున మాస్ థియేటర్స్ ప్యాక్ అవ్వడం గ్యారెంటీ. రామ్ డ్యూయల్ లుక్, బోయపాటి మార్క్ డైలాగ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్, థమన్ ఎలక్ట్రిఫయ్యింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీలీల గ్లామర్ అండ్ డాన్స్ స్కంద సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ గా నిలువనున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ స్కంద ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు.

స్కంద నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన సాంగ్స్ మంచి జోష్ లో ఉన్నాయి. రామ్, శ్రీలీల డాన్స్ స్కిల్స్ ని పూర్తిగా ప్రెజెంట్ చేసే స్కోప్ ఇస్తూ థమన్ సూపర్బ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇచ్చాడు. లేటెస్ట్ గా స్కంద నుంచి ‘డుమ్మారే డుమ్మా’ అనే లిరికల్ సాంగ్ బయటకి వచ్చింది. పెల్లెటూరి నేపథ్యంలో ఉన్న ఈ సాంగ్ చాలా కూల్ గా, మళ్ళీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. కళ్యాణ చక్రవర్తి రాసిన లిరిక్స్ విలేజ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది. రామ్ పోతినేని, ఫ్యామిలీ, సాయీ మంజ్రేకర్ పైన కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని అర్మాన్ మాలిక్ పాడడం విశేషం. మరి పాజిటివ్ వైబ్స్ ని మైంటైన్ చేస్తున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15న ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version