కొంత మంది నటీనటుల విషయంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారి నటనపై మాత్రం పెద్దగా విమర్శలు ఉండవు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్, తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదగడం తో పాటు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి మరింత చేరువయ్యాడు. 2012లో సెకండ్ షో తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను బలపరుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘కాంత’ నవంబర్ 14న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ..
Also Read : Avatar 3: Fire and Ash : ‘అవతార్ 3’ రన్‌టైమ్ ఫిక్స్..
“నేను గొప్ప నటుడినని నేను ఎప్పుడూ అనుకోను. ఇప్పటికి ‘సరిగ్గా నటించలేద’ని విమర్శించే కొన్ని కామెంట్స్ చూస్తాను. అలాంటి చదివినప్పుడు నాపై నాకే అనుమానం వస్తుంది. నిజంగా నేను బాగా నటించడం లేదా అన్న చిన్న భయం వెంటాడుతుంది,” అని చెప్పారు. కానీ అదే భయం నను మరింత కష్ట పడేలా చేస్తుందని, కఠినమైన పాత్రలు చేస్తూ నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే “కొన్ని సినిమాల్లో నేను చేసిన పాత్రను మరెవ్వరూ చేయలేరని ప్రేక్షకులు అనుకునేలా నటించాలన్న తపన ఎప్పుడూ ఉంటుంది” అని అన్నారు. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార, పూజా హెగ్డేతో మరో సినిమా, అలాగే ఒక కొత్త మలయాళ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు.
