Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు. అభిమానుల ఎమోషన్స్ తో హీరోలు ఆడుకుంటున్నారు. వారి సినిమా, యాడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రాంక్స్, ప్రమోషన్స్ స్టంట్స్ అంటూ ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్నారు. తాజాగా ఓ రెండు సంఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అందులో మొదటిది దుల్కర్ సల్మాన్ యాడ్. రెండు రోజుల క్రితం.. దుల్కర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో తనకు ఒక సమస్య ఎదురైంది అని, తనాకు నిద్ర లేదని, దాని గురించి ఇంకా చెప్పాలనుకున్నా.. చెప్పలేకపోతున్నా అని బాధలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వీడియోను డిలీట్ చేయడంతో.. దుల్కర్ కు ఏమైంది..? ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడా.. ? అని అభిమానులు ఆందోళన పడ్డారు. దుల్కర్ ను జాగ్రత్తగా ఉండమని, తామందరం సపోర్ట్ గా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే అదంతా ప్రమోషన్స్ కోసమే అని చెప్పి దుల్కర్ షాక్ ఇచ్చాడు. ఒక ఫోన్ యాడ్ కోసమే దుల్కర్ ఆ వీడియో చేసాడని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Niharika Divorce: సమంత రూ.250 కోట్లు.. నిహారిక రూ. 100 కోట్లు.. ఎలారా ఇలా.. ?
ఇక దుల్కర్ మాత్రమే కాదు రామ్ చరణ్ సైతం అభిమానులను నిరాశపరిచాడు. సాధారణంగా.. మనకు నచ్చిన హీరో.. వేరే ఇండస్ట్రీలో.. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటిస్తున్నాడు అంటే.. ఆ సంతోషం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక చరణ్ అభిమానులు కూడా అదే అనుకున్నారు. మూడు రోజుల క్రితం రామ్ చరణ్, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, త్రిష తో కూడిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. సీక్రెట్ ను జూలై 5 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చరణ్.. బాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అది కూడా యాడ్ కోసమే అని తెలిసి ఉసూరుమంటున్నారు. మీషో కోసం వీరు ఏకమైన్నట్టు చెప్పుకొచ్చారు. ఇలా ఫ్యాన్స్ ఎమోషన్స్ తో హీరోలు ఆడుకొని.. డబ్బు సంపాదిస్తున్నారు అని కొందరు ఫైర్ అవుతున్నారు. ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయో కొద్దిగా ఆలోచించి పోస్ట్ చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.