వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Also Read :Spirit : థియేటర్ కలెక్షన్లతో పనిలేదు.. ఓటీటీతోనే సేఫ్: ‘స్పిరిట్’ బాక్సాఫీస్ అరాచకం షురూ!
ఆ లుక్ లో ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. పెదవుల పై ఉన్న సిగరెట్, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్, గ్రిట్టీ టచ్‌ను జోడిస్తోంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ఆమె ప్రజెన్స్ పవర్ ఫుల్ గా ఉండబోతోందని లుక్ చెప్పేస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫాన్స్ అయితే హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
