టాలీవుడ్ లో ఒకేసారి జోష్ వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి మూతబడ్డ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మొదలు ‘సర్కారు వారి పాట’ దాకా అన్ని రకాల చిత్రాలు విడుదలకి కౌంట్ డౌన్ మొదలెట్టేశాయి. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దూకుడుగా వెళుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలు క్రిస్మస్, సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుంటే వరుణ్ మాత్రం దీపావళికే వచ్చేస్తున్నాడు. ‘గనీ’గా తన కిక్ బాక్సింగ్ పంచులతో బాక్సాఫీస్ బద్ధలు కొట్టబోతున్నాడు.
Read Also : దుమ్మురేపుతున్న “సర్కారు వారి పాట” టీజర్
‘గని’ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ‘ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ దిస్ దివాలీ 2021’ అంటూ ఫిల్మ్ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే… నవంబర్ లో ఫ్యాన్స్ మెగా ప్రిన్స్ ని బాక్సింగ్ రింగ్ లో చూడవచ్చన్నమాట! ‘గనీ’ సినిమాతో కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ముంబై బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ బీ-టౌన్ నటుడు సునీల్ శెట్టి కూడా చిత్రంలో ఉన్నాడు. థమన్ ‘గనీ’ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నాడు…
