రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా F3 Movie నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ఈ సమ్మర్ సోగ్గాళ్ళ రాక కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మే 27న “ఎఫ్3” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Read Also : Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !
ఇక ప్రస్తుతం “ఎఫ్ 3” మూవీ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇటీవలే పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు మేకర్స్. ఇక సినిమాలో నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ “డబ్బు” అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 22న “ఊ ఆ అహ” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ఇంతకుముందు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా డీఎస్పీ షేర్ చేసిన వీడియోలో “ఊ ఆ అహ” సాంగ్ సెట్స్ కు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేశాడు. మరి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Everyone on the sets are already grooving to the perky beat🤘
Now get ready to sing &swing🕺🏻#WooAaaAhaAha Promo Tomorrow @ 10:08AM🥳https://t.co/7PMsBEv5PF#F3Movie@AnilRavipudi @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 19, 2022
