Site icon NTV Telugu

రకుల్ విచారణ పూర్తి.. రియా చక్రవర్తి ప్రస్తావన

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. 7 గంటలు పాటు ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. బ్యాంక్ లావాదేవీలుపై ప్రశ్నించిన ఈడీ.. 30 ప్రశ్నలకు రకుల్ నుండి సమాచారం రాబట్టుకొంది. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన రావాలని రకుల్ కు అధికారులు తెలియజేశారు. కెల్విన్ తో సంబందాలు, ఎఫ్ క్లబ్ లో పార్టీపై ఆరా తీశారు. కాగా, రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్ పై ఈడీ అధికారులు విచారణలో అడిగి తెలుసుకున్నారు. మూడు బ్యాంక్ అకౌంట్ల వివరాలను రకుల్ నుండి క్లారిటీ తీసుకున్నారు. 13 తేదీన ఎఫ్ క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకుల్ వ్యవహారంపై ఈడీ క్లారిటీకి రానుంది. ఇక ఈ నెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ విచారణ జరుగనుంది.

Exit mobile version