Site icon NTV Telugu

Driver Jamuna First look : క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తిన హీరోయిన్!

Driverjpg

Driverjpg

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అర్థవంతమైన చిత్రాలలో నటిస్తోంది ఐశ్వర్యా రాజేశ్‌. ఆమె నటించిన కథాబలం ఉన్న తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలానే తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు తమిళంలో డబ్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలన్నది చిత్ర నిర్మాణ సంస్థ 18 రీల్స్ ఆలోచన. అన్ని భాషల్లోనూ దీనికి ‘డ్రైవర్ జమున’ అనే పేరునే ఖరారు చేశారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘డ్రైవర్ జమున’ గురించి దర్శకుడు కిన్ స్లిన్ మాట్లాడుతూ, ”ఐశ్వర్యా రాజేశ్‌ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకులలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ కథను తయారు చేయడం జరిగింది. ఇవాళ టాక్సీ ఇండస్ట్రీ విశేషంగా పెరిగిపోయింది. క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన అంశాలను ఇందులో డీల్ చేస్తున్నాం. అందులోనూ ప్రత్యేకంగా ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన లేడీ డ్రైవర్ జీవితాన్ని చూపించబోతున్నాం. ఈ క్రైమ్ థిల్లర్ కోసం తన శరీరాకృతిని మరింత దృఢం చేసుకోవడానికి ఐశ్వర్యా రాజేశ్‌ కృషి చేస్తోంది. అలానే క్యాబ్ డ్రైవర్స్ ను కలిసి, వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించి, దానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే ప్రయత్నం చేస్తోంది” అని చెప్పారు.

Exit mobile version