Site icon NTV Telugu

Drishyam 3: ‘ మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ అభిమానులకు.. గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు జీతూ

Drusyam 3

Drusyam 3

‘దృశ్యం’ సిరీస్‌ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌ మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్‌ స్టోరీటెల్లింగ్‌ వల్ల ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ మూడో భాగం ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ షేర్‌ చేశారు.

Also Read : Shah Rukh Khan: కారు కేసులో బాలీవుడ్‌ స్టార్స్‌..షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె

‘ ‘దృశ్యం 3’ ప్రేక్షకులకు నచ్చడం ఖాయం. కానీ, రెండో భాగం లాగా హై-ఇంటెలిజెన్స్‌ సన్నివేశాలు ఉంటాయని ఎవరు అనుకుంటే వారు కొంత నిరాశ చెందవచ్చు. ఎందుకంటే ఈసారి స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. మోహన్‌లాల్‌ పాత్రలో గత నాలుగేళ్లలో ఎన్నో మార్పులు చేశాం. ఆయన ఎప్పటికీ నా కళ్లలో జార్జ్‌ కుట్టీగానే ఉంటారు” అని జీతూ అన్నారు. అలాగే సినిమా పనుల గురించి మాట్లాడుతూ.. “స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. షూటింగ్‌ వచ్చే నెలలో స్టార్ట్‌ అవుతుంది. ముందుగా మోహన్‌లాల్‌ ప్రధానంగా ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ కథను నేను యూరప్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు రాసుకున్నాను. దుబాయ్‌ ఫ్లైట్‌ ప్రయాణంలోనే సీన్‌ ఆర్డర్‌ రెడీ చేశాను. కొన్ని సార్లు తెల్లవారుజామున లేచి సన్నివేశాలు రాశాను. మొత్తం ఐదు రఫ్‌ కాపీలు తయారు చేసి, కెమెరామెన్‌, ఎడిటర్‌ సహా టీమ్‌ అందరికీ చదవమని ఇచ్చి, వారి సలహాల ప్రకారం మార్పులు చేశాను” అని వివరించారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version