Madala Ravi: వైట్‌కోట్ కట్టుకున్న విప్లవ యోధుడు: మాదాల రవి రియల్ లైఫ్ జర్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై ప్రజాగళం వినిపించిన విప్లవ నటుడు మాదాల రంగారావు బాటలో నడుస్తూ, నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా నిరుపేదలకు ప్రాణదాతగా నిలిచిన డాక్టర్ మాదాల రవి బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాలతో పాటు వైద్య రంగంలోనూ, ప్రజా ఉద్యమాలలోనూ ఆయన సాగిస్తున్న ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. దిగ్గజ నటుడు మాదాల రంగారావు దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం ‘ఎర్రమల్లెలు’ ద్వారా మాదాల రవి బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలోని “నాంపల్లి స్టేషన్ కాడి…” పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. సినిమాలపై ఉన్న మక్కువతో పాటు చదువులోనూ రాణించిన ఆయన, రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ (MD), గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం (DM) పూర్తి చేసి ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించడంతో పాటు, రష్యాలోని భారతీయ సంస్థలకు మరియు సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేశారు.
భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన మాదాల రవి, టాలీవుడ్లో వరుస చిత్రాలను నిర్మించడంతో పాటు హీరోగానూ మెప్పించారు. ‘నేను సైతం’, ‘మా ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’, ‘పంచముఖి’, ‘వీరగాధ’, ‘ఆజ్ కా ఇంక్విలాబ్’, ‘నాగ్ లక్ష్మి’ వంటి పలు చిత్రాలలో ఆయన హీరోగా నటించి, నిర్మించారు. గ్యాస్ట్రోఎంటరాలజీలో అత్యుత్తమ వైద్య అర్హతలు ఉన్నప్పటికీ, డాక్టర్ మాదాల రవి ఎప్పుడూ వైద్యాన్ని వ్యాపారంగా చూడలేదు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృతంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు ప్రాణదానం చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, శ్రామిక కుటుంబాలు, నిరుపేద వర్గాలు మరియు జీర్ణాశయ వ్యాధిగ్రస్తులకు ఆయన అందిస్తున్న సేవలు అనన్యసామాన్యం. నిస్వార్థంగా ఆయన చేస్తున్న వైద్య సేవలకే ప్రజలు ఆయన్ను ప్రేమగా ‘పీపుల్స్ డాక్టర్’ అని పిలుచుకుంటారు. కేవలం వైద్యుడిగా, నటుడిగానే కాకుండా ప్రజా నాట్య మండలి, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీల నాయకుడిగా అనేక ప్రజా ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. సామాజిక అన్యాయాలు, దురాగతాలపై పోరాడటానికి కళే అత్యంత శక్తివంతమైన ఆయుధమని ఆయన ప్రగాఢంగా నమ్ముతారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా సినీ కార్మికులకు, ‘మా’ సభ్యులకు నిరంతరం అండగా నిలుస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని నిరుపేద కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆయన ముందుండి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
- Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 'కాకా' లేనట్టేనా..?
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!